![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ మంగళవారం నాటి 1092 లో.... దేవయాని, శైలేంద్ర ఇద్దరు మహేంద్ర వాళ్ళను బాధపెట్టాలని వాళ్ళ ఇంటికి వస్తారు. ఈ మను గురించి ఆలోచిస్తూ అసలు రిషి గురించి మర్చిపోయారని దేవయాని అంటుంది. మూడు నెలల్లో రిషిని తీసుకోని వస్తానన్నావ్.. ఇప్పుడేంటి ఆ ధ్యాసే లేదు.. మూడు నెలల కావడానికి ఇంకా వారం రోజులే ఉందని దేవయాని అంటుంది. నేను రిషి సర్ ని తీసుకొని వస్తానని, లేదంటే నేనే వెళ్ళిపోతానని వసుధార చెప్తుంది.
నిన్ను చూస్తుంటే బాధగా ఉంది తండ్రి ఎవరో తెలియక పడరాని పాట్లు పడుతున్నావ్.. నీ తండ్రి ఎవరో తెలుసుకోవడానికి చాలా పాట్లు పడుతున్నావని మనుని దేవయాని అంటుంది. నీ బాధని తగ్గించడానికే మాట్లాడుతున్నాను. నీ తండ్రి ఎవరో చెప్పమని నీ తల్లిని అడుగమని మనుతో దేవయాని చెప్తుంది. తను సమాధానం చెప్పదు కదా.. అలా అయితే ఎలా నువ్వు బ్రతుకి ఉన్నంతవరకు ఇలా తండ్రి ఎవరో తెలియకుండా ఉండడమేనా అని దేవయాని అనగానే.. అవసరం లేదు.. అనుపమ చెప్పకపోయిన మను తండ్రి గురించి నేనే తెలుసుకుంటాను.. మను ముందు నిలబెడతానని మహేంద్ర అంటాడు. అసలు నీకెందుకు మహేంద్ర తన తల్లి చెప్పకుండా మౌనంగా ఉంది. అసలు మనుని ఒక్క మాట కూడా పడనివ్వవు.. తనని దత్తత తీసుకోవడానికి రెడీ అయ్యావ్. అసలు నేను తిట్టానని ఇక్కడకు వచ్చావా? అనుపమ వస్తుందని ఇక్కడికి వచ్చావా అని దేవయాని అంటుంది. అలా అనగానే మహేంద్ర ఆవేశపడతాడు. మీకేం తెలుసని మాట్లాడుతున్నారని అనుపమ అంటుంది.
రిషిని వారం రోజుల్లో తీసుకొని వస్తానని వసుధార చెప్పింది.. మను తండ్రిని తీసుకొని వస్తానని చెప్తున్నా ఇంకేంటని మహేంద్ర కోప్పడతాడు. అసలు రిషి రాడని శైలేంద్ర అనగానే.. నువ్వు ఎలా చెప్పగలవ్.. నువ్వు ఏమైనా చేసావా అని శైలేంద్రపై వసుధార విరుచుకుపడుతుంది. ఇక కాసేపటికి శైలేంద్ర, దేవయాని ఇంటికి వెళ్తారు. ఇంతకీ మనం గెల్చామా.. వాళ్ళు గెల్చారా.. అని శైలేంద్ర అనగానే మనదే పైచెయ్యి అని దేవయాని అంటుంది. మరొకవైపు రిషి ఫోటో చూస్తూ వసుధార బాధపడుతుంది. వసుధార, అనుపమ, మహేంద్ర మనులు దేవయాని అన్న మాటలు గుర్తుకుచేసుకుంటారు. రిషిని ఎలాగైనా వెతకాలి.. వారం రోజులే టైమ్ ఉందని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |